Hritik Roshan: మా నాన్నకు కేన్సర్ సోకింది: షాకింగ్ ట్వీట్ పెట్టిన హృతిక్ రోషన్

  • గొంతు కేన్సర్ సోకింది
  • ప్రారంభ దశలోనే ఉంది
  • ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించిన హృతిక్

ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్‌, తన అభిమానులతో పాటు యావత్ బాలీవుడ్ దిగ్భ్రాంతి చెందే వార్తను చెప్పారు. ఈ ఉదయం తన తండ్రి రాకేష్ రోషన్ తో కలిసి ఓ జిమ్ లో దిగిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన హృతిక్, తన తండ్రికి కేన్సర్ సోకిందని అన్నారు.

 "ఈ ఉదయం మా నాన్నతో ఓ ఫోటో తీసుకోవాలని ఉందని అడిగాను. సర్జరీ జరిగే రోజు కూడా ఆయన వ్యాయామం మానలేదు. మా నాన్న చాలా బలమైన వారు. కొద్ది వారాల క్రితం ఆయన గొంతు కేన్సర్ తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఇది ప్రారంభ దశలోనే ఉంది. కేన్సర్ పై యుద్ధం చేయడానికి ఆయన బయలుదేరారు. ఆయన వంటి తండ్రి దొరకడం నాకెంతో అదృష్టం. మా కుటుంబానికి కూడా - లవ్ యూ డాడ్" అని అన్నారు.

 ఇటీవలి కాలంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కేన్సర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇర్ఫాన్‌ ఖాన్‌, సోనాలి బింద్రే తదితరులు కేన్సర్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ, రాకేష్ రోషన్ సంగతి తెలియడంతో అభిమానులు షాక్‌ అవుతున్నారు.

Hritik Roshan
Rakesh Roshan
Instagram
Cancer
  • Loading...

More Telugu News