Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో దారుణం.. ఆకలికి తట్టుకోలేక పురుగుల మందు తాగిన చిన్నారులు.. పరిస్థితి విషమం

  • గిరిజనులకు అందని సరకులు
  • ఆకలితో కుటుంబాలు
  • స్థానిక మీడియా వెల్లడి
  • నివేదిక కోరిన ఎన్‌సీపీసీఆర్

ఆకలికి తట్టుకోలేక చిన్నారులు పురుగుల మందు తాగిన ఘటన సంచలనం రేపుతోంది. డిసెంబర్ 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ పిల్లల పరిరక్షణ సమితి ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేసింది. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో కొందరు గిరిజనులకు రేషన్ దుకాణాల నుంచి సరకులు అందడం లేదు. దీంతో ఆయా కుటుంబాలు ఆకలితోనే గడుపుతున్నాయి.

ఈ క్రమంలో ఆ కుటుంబాల్లోని చిన్నారులు ఆకలికి తట్టుకోలేక పురుగుల మందు తాగారు. వెంటనే చిన్నారులను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. స్థానిక మీడియా సంస్థల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని జాతీయ పిల్లల పరిరక్షణ సమితి స్థానిక అధికారులను ఆదేశించింది.

Madhya Pradesh
NCPCR
Rathlam
December
Children
  • Loading...

More Telugu News