forward castes: అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం: ఆర్.కృష్ణయ్య

  • ఇష్టమొచ్చినట్టుగా రిజర్వేషన్లు ఇస్తామంటే కుదరదు
  • 60 శాతంకి రిజర్వేషన్లు పెంచుతామంటే ఊరుకోం
  • రాజకీయ లబ్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు

అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని బీసీ నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇష్టమొచ్చినట్టుగా రిజర్వేషన్లు ఇస్తామంటే కుదరదని, అరవై శాతంకి రిజర్వేషన్లు పెంచుతామంటే ఊరుకోమని, కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి దమ్ముంటే దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీలకు 53 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

forward castes
BC leader
R.krishnaiah
reservations
  • Loading...

More Telugu News