gvl narasimha rao: కీలక నిర్ణయం తీసుకున్న మోదీకి నమస్కరిస్తున్నా: జీవీఎల్

  • అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం నిర్ణయం
  • ఇది చారిత్రక నిర్ణయం అన్న జీవీఎల్
  • సబ్ కా సాథ్ నినాదాన్ని సాకారం చేశారంటూ ప్రశంస

అగ్రవర్ణాల పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు రేపు పార్లమెంటు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

'చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి వందనం చేస్తున్నా. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా మోదీ నిబద్ధతను ప్రదర్శించారు. సబ్ కా సాథ్ నినాదాన్ని సాకారం చేశారు.' అంటూ ట్వీట్ చేశారు.

gvl narasimha rao
modi
upper caste
reservations
  • Loading...

More Telugu News