Andhra Pradesh: నా చెల్లి అఖిలప్రియకు లేని సెక్యూరిటీ నాకు ఎందుకు?: గన్ మెన్లను తిప్పిపంపిన భూమా బ్రహ్మానంద రెడ్డి

  • అఖిలప్రియ అనుచరుల ఇళ్లలో పోలీసుల సోదాలు
  • నిరసనగా గన్ మెన్లను తిప్పిపంపిన ఏపీ మంత్రి
  • సోదరికి మద్దతుగా అదే పనిచేసిన బ్రహ్మానందరెడ్డి

నంద్యాలలో తన అనుచరుల ఇళ్లలో ఇటీవల పోలీసులు దాడులు నిర్వహించినందుకు ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల తీరుకు నిరసనగా ఆమె తన గన్ మెన్లను వెనక్కు పంపారు. తాజాగా ఆమె బాటలోనే సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నడిచారు. ఏపీ ప్రభుత్వం కల్పించే భద్రత తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. తన చెల్లెలికి లేని భద్రత తనకు కూడా అవసరం లేదని తేల్చిచెప్పారు.

ఈ నేపథ్యంలో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సోమవారం నియోజకవర్గంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భూమా అఖిలప్రియ అనుచరుల ఇళ్లలో తనిఖీలపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ఆ ప్రాంతంలో ఉన్న అందరి ఇళ్లలో తనిఖీలు చేపట్టామని తెలిపారు. కేవలం భూమా వర్గీయులనే టార్గెట్ చేశామని చెప్పడం సరికాదని అప్పట్లో వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Kurnool District
nandyal
bhuma
akhila priya
bramhananda reddy
Telugudesam
return
gun men
  • Loading...

More Telugu News