renu desai: 'బిగ్ బాస్ 3'లో సందడి చేయబోయేది వీరేనా?

  • 'బిగ్ బాస్ 3'కి సన్నాహాలు
  • జాబితాలో రేణు దేశాయ్ పేరు
  • లీక్ కాకుండా జాగ్రత్తలు  

'బిగ్ బాస్' .. 'బిగ్ బాస్ 2' షోలు బాగా పాప్యులర్ కావడంతో, 'బిగ్ బాస్ 3' కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో 'బిగ్ బాస్ 3' షోను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోయేది వీరేనంటూ కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి.

రేణు దేశాయ్ .. ఉదయభాను .. శోభిత ధూళిపాల .. గద్దె సిందూర .. యూట్యూబ్ స్టార్ జాహ్నవి, వరుణ్ సందేశ్ .. కమల్ కామరాజు .. జాకీ .. హేమచంద్ర .. రఘు మాస్టర్ .. 'జబర్దస్త్' పొట్టి నరేశ్ తదితరులు పాల్గొననున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ షోకి హోస్ట్ గా చిరంజీవిగానీ .. వెంకటేశ్ గాని వ్యవహరించవచ్చని తెలుస్తోంది. క్రితంసారి ఈ షోకి సంబంధించిన విషయాలు కొన్ని ముందుగానే లీక్ కావడం నిర్వాహకులను ఇబ్బంది పెట్టింది. అందువలన ఈ సారి అలాంటివేం జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

renu desai
shobhitha
varun sandesh
udaya bhanu
  • Loading...

More Telugu News