Andhra Pradesh: చంద్రబాబు అభద్రతాభావంలో ఉన్నారు.. ఎవరు ఫినిష్ అవుతారో ఎన్నికల్లో తేలిపోతుంది!: ఆనం రామనారాయణ రెడ్డి

  • చంద్రబాబు వ్యక్తులపై చిందులేయడం సిగ్గుచేటు
  • మహిళను ఫినిష్ చేస్తా అని హెచ్చరించారు
  • మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత

సమస్యలను ప్రస్తావించేందుకు వెళ్లిన వ్యక్తులపై ఏపీ సీఎం చంద్రబాబు చిందులేయడం సిగ్గుచేటని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు అభద్రతాభావంతో వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. అందుకే ఓ మహిళను ఫినిష్ చేస్తానని వ్యాఖ్యానించారని దుయ్యబట్టారు. నెల్లూరులోని తన ఇంట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆనం మాట్లాడారు.

ఏపీలో ఎవరిని ఎవరు ఫినిష్ చేస్తారో రాబోయే ఎన్నికల్లో తేలిపోతుందని ఈ సందర్బంగా ఆనం అన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. 54 నెలల్లో ఏపీలో టీడీపీ సాధించిన అభివృద్ధి శూన్యమన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందిస్తూ.. జగన్‌ సీఎం అయితే మాజీ మంత్రి ఆనంకు ఉన్నత స్థానం కల్పిస్తారన్నారు. ఎమ్మెల్యే అనిల్‌ మాట్లాడుతూ జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీని గెలిపించుకునేందుకు సమష్టిగా కృషి చేద్దామన్నారు.

Andhra Pradesh
anam
ram narayana reddy
Chandrababu
YSRCP
Telugudesam
BJP
  • Loading...

More Telugu News