Andhra Pradesh: వైసీపీని బీజేపీలో విలీనం చేయించడానికి రామచంద్రయ్య ప్రయత్నిస్తున్నారు!: కడప డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లా

  • పీఆర్పీని అధికారం కోసం కాంగ్రెస్ లో కలిపేశారు
  • బీజేపీ ఆయనకు ఎంపీ స్థానం ఆఫర్ చేసింది
  • మీడియాతో కడప డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లా ఖాన్

వైసీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్యపై కడప డిప్యూటీ మేయర్, టీడీపీ నేత ఆరీఫుల్లా విరుచుకుపడ్డారు. రామచంద్రయ్యకు అధికార దాహం ఎక్కువని ఆయన విమర్శించారు. రామచంద్రయ్యకు ఇప్పుడు రాజకీయ గుర్తింపు ఉందంటే అది టీడీపీ వల్లేనని స్పష్టం చేశారు. జిల్లాలోని 28వ డివిజన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అధికార దాహంతోనే రామచంద్రయ్య ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయించారని ఆరీఫుల్లా ఆరోపించారు. ప్రస్తుతం మోదీ ఆదేశాల మేరకు ఆయన వైసీపీలో చేరారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని బీజేపీలో విలీనం చేసే దిశగా రామచంద్రయ్య ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇందుకు ప్రతిఫలంగా రామచంద్రయ్యకు బీజేపీ రాజ్యసభ సీటును ఆఫర్ చేసిందని వెల్లడించారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
BJP
c ramachandraiah
prp
  • Loading...

More Telugu News