nagababu: ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు మీ బ్రీడ్, బ్లడ్ ఏమయ్యాయి?: బాలయ్యపై నాగబాబు ఘాటు విమర్శ

  • రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు
  • ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిస్తే మీరేం చేశారు
  • ఫేస్ బుక్ లో స్పందించిన మెగా బ్రదర్

రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చనీ, ఎవరైనా విజయం సాధించవచ్చని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. చాలా సాధారణ కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చినవారు కూడా రాజకీయాల్లో సక్సెస్ అయ్యారని వ్యాఖ్యానించారు. ఓసారి రాజకీయాల్లో సక్సెస్ అయినవారు ప్రతీసారి కావాలని లేదనీ, అలాగే ఓసారి ఫెయిల్ అయితే ప్రతీసారి ఫెయిల్ కావాలని ఏమీ లేదని స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు ఫేస్ బుక్ లో ఈరోజు ఓ వీడియోను విడుదల చేశారు.

తాము గతంలో ఓసారి ఫెయిల్ అయ్యామనీ, దానర్థం ప్రతీసారి ఫెయిల్ అవుతామని కాదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విజయవంతంగా సాగిపోతున్న మహానుభావుడు ఎన్టీఆర్ ను మీ బావ వెన్నుపోటు పొడిస్తే మీరు ఏం చేశారు? అని బాలయ్యను సూటిగా ప్రశ్నించారు. ఆయన పట్ల మీరు చేసింది తప్పుకాదా? అని నిలదీశారు. కన్నతండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు మీ బ్రీడ్ ఏమయింది? మీ బ్లడ్ ఏమయింది? అని బాలకృష్ణను ప్రశ్నించారు.

nagababu
mega brother
Video
criticise
ntr
Chandrababu
Balakrishna
  • Error fetching data: Network response was not ok

More Telugu News