Krishna District: మరికాసేపట్లో నిమ్మకూరుకు చేరుకోనున్న బాలకృష్ణ.. షూటింగ్ చేసే ఛాన్స్!

  • ఉదయం 10.20 గంటలకు గన్నవరంకు రాక
  • తల్లిదండ్రుల విగ్రహాలకు నివాళులు అర్పించనున్న నటుడు
  • ఎల్లుండి విడుదల కానున్న కథానాయకుడు

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ  మరికాసేపట్లో కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామం నిమ్మకూరుకు చేరుకోనున్నారు. ఈరోజు ఉదయం 10.20 గంటకు గన్నవరం చేరుకోనున్న బాలయ్య.. నిమ్మకూరులో తల్లిదండ్రులు ఎన్డీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో నిమ్మకూరులో ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది.

కాగా, బాలకృష్ణతో పాటు హీరో కల్యాణ్ రామ్, నటి విద్యాబాలన్ రానున్నారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా ఎన్డీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’కు సంబంధించిన కొన్ని సీన్లు తెరకెక్కించే అవకాశముందని భావిస్తున్నారు. బాలకృష్ణ నటించిన ఎన్డీఆర్ కథానాయకుడు సినిమా ఎల్లుండి అంటే ఈ నెల 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Krishna District
Balakrishna
shooting
nimmakur tour
  • Loading...

More Telugu News