Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారని జగన్ కు భయం పట్టుకుంది!: రఘువీరా రెడ్డి

  • అందుకే వెంటపెట్టుకుని తిరుగుతున్నారు
  • గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లడం లేదు
  • అనంతపురంలో మీడియాతో కాంగ్రెస్ నేత

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ తన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపడానికి భయపడుతున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను సభకు పంపిస్తే ఎక్కడ అమ్ముడుపోతారోనన్న భయం జగన్ లో నెలకొందనీ, అందుకే వారందరినీ వెంటపెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా గుడిబండలో రఘువీరా మీడియాతో మాట్లాడారు.

ప్రజాసమస్యలపై వాణిని వినిపిస్తారని ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించారని రఘువీరా గుర్తుచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Congress
raghuveera reddy
  • Loading...

More Telugu News