Guntur District: అప్పటిలా క్లాస్ సినిమాలు మళ్లీ రావాలి: స్పీకర్ కోడెల శివప్రసాద్

  • గుంటూరులో నెలనెలా వెన్నెల కార్యక్రమం
  • ముఖ్య అతిథులుగా కోడెల, జమున
  • శాస్త్రీయ నృత్యాలకు ఆదరణ పెరగాలి

గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం రాధా మాధవ రసరంజని సంస్థ ఆధ్వర్యంలో 'నెల నెలా వెన్నెల' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూచిపూడి నాట్యాచార్యులను సన్మానించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్, అలనాటి నటి జమున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ.. సినిమాల్లో ప్రస్తుత ధోరణి మారాల్సిన అవసరం ఉందన్నారు. కమర్షియల్ సినిమాలే కాకుండా  సామాజిక బాధ్యత పెంచే సందేశాత్మక సినిమాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. సినిమాల్లో రోజురోజుకు విలువలు పతనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఒకప్పటిలా క్లాస్ సినిమాలు రావాలని అభిలషించారు. సినిమాలకు లభిస్తున్నట్టుగానే కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలకు కూడా ఆదరణ పెరగాలని కోడెల అభిప్రాయపడ్డారు.

Guntur District
Nelanela vennela
Kodela shivaprasad
Actress Jamuna
speaker
  • Loading...

More Telugu News