mim: ఎంఐఎం సభ్యుడు ప్రొటెం స్పీకర్ గా ఉండగా అసెంబ్లీలోకి అడుగుపెట్టను: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ శపథం

  • నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను
  • సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
  • అలా చేస్తే తెలంగాణ రాష్ట్రానికి మంచిది

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబట్టారు. ఎంఐఎం సభ్యుడు ప్రొటెం స్పీకర్ గా ఉండగా తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనని తెగేసి చెప్పారు. ప్రొటెం స్పీకర్ ఉన్న సమయంలో అసెంబ్లీలోకి తాను అడుగుపెట్టనని రాజా సింగ్ ప్రతిన బూనారు. సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి మంచిదని సూచించారు.

mim
protem speaker
mumtaz ahammad
bjp
mla
rajasingh
Telangana
cm
kcr
  • Loading...

More Telugu News