kanna lakshmi narayana: కన్నాకు బుద్ధిమాత్రం పెరగట్లేదు: మంత్రి ఆనందబాబు

  • బీజేపీ-వైసీపీవి కుమ్మక్కు రాజకీయాలు
  • కన్నా ఎంతో దిగజారి ప్రవర్తిస్తున్నారు
  • బీజేపీతో వైసీపీ అంటకాగుతోంది

టీడీపీ నాయకులు తనను హత్య చేయడానికి ప్రయత్నం చేశారని కన్నా ఆరోపించడం, కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీకి కోడికత్తి కేసును బీజేపీ ప్రభుత్వం అప్పగించడం.. చూస్తుంటే బీజేపీ-వైసీపీ కుమ్మక్కు రాజకీయాలకు అద్దంపడుతున్నాయని విమర్శించారు. కన్నాకు వయసు, రాజకీయ అనుభవం పెరుగుతోంది తప్ప బుద్ధిమాత్రం పెరగట్లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కన్నా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో, అంతకన్నా ఇప్పుడు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఏదో విధంగా తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీతో వైసీపీ అంటకాగుతోందని దుయ్యబట్టారు.

kanna lakshmi narayana
bjp
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News