Bhukya Chandrakala: తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారిణి చంద్రకళ ఇంట్లో సీబీఐ సోదాలతో కలకలం!
- ఇసుక అక్రమ తవ్వకాల్లో ఆరోపణలు
- రాజన్న సిరిసిల్ల జిల్లా గర్జనపల్లిలో చంద్రకళ ఇల్లు
- మొత్తం 14 చోట్ల దాడులు చేసిన అధికారులు
యూపీలో ఇసుక అక్రమ తవ్వకాల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారిణి, ప్రస్తుతం యూపీలో ఉన్న భూక్యా చంద్రకళ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతిపరుల పాలిట సింహస్వప్నంగా, తప్పు చేసే అధికారులను రోడ్డుపైనే నిలదీసే అధికారిణిగా పేరున్న ఆమె, సోషల్ మీడియాలోనూ ప్రాచుర్యం పొందారు.
యూపీలోని బులంద్ షహర్, మధుర, హమీర్ పుర కలెక్టర్ (డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్) గా పనిచేస్తున్న వేళ ఇసుక కాంట్రాక్టుల్లో ఆమె అక్రమాలకు పాల్పడ్డట్టు ఇటీవల ఆరోపణలు రాగా, తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గర్జనపల్లిలోని ఆమె ఇల్లు, యూపీలో ఉంటున్న ఇల్లు సహా 14 చోట్ల దాడులు జరిగాయి. కాగా, యూపీలో అఖిలేష్ యాదవ్, మాయావతి పొత్తు పెట్టుకున్న నేపథ్యంలోనే గనుల అక్రమ తవ్వకాలంటూ కేంద్రం ప్రతీకార చర్యలకు దిగిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.