Chandrababu: తమ జాతకాలు బయటపడతాయని చంద్రబాబు భయం: జీవీఎల్ విమర్శలు

  • జగన్ పై దాడి ఘటనను తక్కువ చేసి చూపించారు
  • ఎన్ఐఏకు అప్పగించడంతో బాబుకు భయం పట్టుకుంది
  • టీడీపీ కక్షసాధింపు వైఖరి తగదు

విశాఖపట్టణం విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి ఘటనను తక్కువ చేసి చూపించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు యత్నిస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని అన్నారు.

వాస్తవాలు బయటకొస్తే తమ జాతకాలు తారుమారవుతాయని చంద్రబాబు భయపడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడి ఘటనను టీడీపీ తక్కువ చేసి చూపించిన తీరు, ఆ పార్టీ కుళ్లుబోతు తనానికి, కక్ష సాధింపు వైఖరికి అద్దంపడుతోందని విమర్శించారు.

Chandrababu
gvl
Telugudesam
bjp
Jagan
YSRCP
  • Loading...

More Telugu News