gvl: ఏపీలో కూడా రెండు సీట్లతో టీడీపీ సంతోష పడబోతోంది: జీవీఎల్ సెటైర్లు

  • తెలంగాణలో చంద్రబాబుని, టీడీపీని ప్రజలు ఛీ కొట్టారు
  • దీంతో, బాబులో అసహనం పెరిగిపోయింది
  • మహిళలు, ఇతర రాజకీయపార్టీలపై బాబుకు సహనం లేదు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి విమర్శలు చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ప్రజాకూటమి ఓటమి తర్వాత చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుని, ఆయన పార్టీని ప్రజలు ‘ఛీ’ కొట్టారని, ఏపీలో కూడా అదే జరగబోతోందని, ఏపీలో వచ్చే ఎన్నికల్లో కూడా రెండు సీట్లతో టీడీపీ సంతోషపడబోతోందని సెటైర్లు విసిరారు.

ఈ సందర్భంగా నిన్న కాకినాడలో చంద్రబాబును బీజేపీ నాయకులు అడ్డుకున్న ఘటనపై వ్యాఖ్యానించారు. తమ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలపై చంద్రబాబు వ్యవహరించిన తీరు పూర్తిగా గర్హనీయమని అన్నారు. మహిళలు, ఇతర రాజకీయపార్టీల పట్ల చంద్రబాబుకు సహనం లేదని, వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతామన్న భయంతోనే ఆయన అసహనానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలోని ప్రజలందరూ తన వెంటే ఉన్నట్టుగా ఆయన ఊహించుకోవడం తగదని, చిల్లర బిల్డప్స్ ఇవ్వొద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో అధికారం లేకుండా పదేళ్ల పాటు ఉన్న చంద్రబాబుకు, మళ్లీ అదే భవిష్యత్ లో ఆయనకు రాబోతోందని జోస్యం చెప్పారు.

gvl
Chandrababu
Telugudesam
bjp
Telangana
Andhra Pradesh
prajakutami
kakinada
  • Loading...

More Telugu News