Andhra Pradesh: ‘తెలంగాణ గడ్డపై పాతిన ఈ జెండా.. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అండాదండా’!: జనసేన స్పెషల్ సాంగ్ విడుదల

  • ట్విట్టర్ లో జెండారే.. జెండా పాట రిలీజ్
  • ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్న పవన్
  • మాస్ బీట్ తో అదరగొట్టేస్తున్న పాట

రాబోయే ఏపీ ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న నెల్లూరు జిల్లా నేతలతో సమావేశమైన పవన్.. ఈరోజు ప్రకాశం, చిత్తూరు జిల్లాల పార్టీ నేతలు, కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలను, అభిమానులను ఉత్సాహపరిచేందుకు ‘జెండరే..జెండా’ పేరుతో ఓ ప్రత్యేకమైన పాటను పార్టీ విడుదల చేసింది. ‘తెలంగాణ గడ్డపై పాతిన ఈ జెండా.. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అండాదండా’ అంటూ పక్కా మాస్ బీట్ తో అదరగొట్టేస్తున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena
Jandare Janda' exclusive special song
  • Error fetching data: Network response was not ok

More Telugu News