ayesha meera: ఆయేషా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ

  • కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్, విశాఖ సీబీఐ అధికారులు
  • సహకరించాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ కు విన్నపం
  • పోలీసుల నుంచి ఫైళ్లను తీసుకున్న అధికారులు

ఆయేషా మీరా హత్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసును సీబీఐ విచారిస్తోంది. తాజాగా కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విశాఖ, హైదరాబాద్ సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలసి కేసు విచారణకు సహకరించాలంటూ సీబీఐ అధికారులు కోరారు. కేసుకు సంబంధించిన ఫైళ్లను పోలీసుల నుంచి తీసుకున్నారు. మరోవైపు సీబీఐ అధికారులకు తోడుగా ఓ పోలీస్ అధికారిని ద్వారకా తిరుమలరావు పంపించారు.

ayesha meera
murder
case
cbi
dwaraka tirumalarao
  • Loading...

More Telugu News