adah sharma: వైరల్ అవుతున్న నటి అదాశర్మ బెల్లీ డ్యాన్స్... వీడియో చూడండి

  • ఆల్కహాల్ ను తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలపై వీడియో
  • గతంలో ధూమపానానికి వ్యతిరేకంగా వీడియోను రూపొందించిన అదా
  • అభిమానుల కోరిక మేరకు సోషల్ మీడియాలో అప్ లోడ్

తెలుగులో పలు సినిమాల్లో నటించిన అదాశర్మ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగానే ఉంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సదుద్దేశంతో ఈ వీడియోను ఆమె రూపొందించింది. బెల్లీ డ్యాన్స్ చేస్తూ బీర్ ను తాగుతున్నట్టుగా వీడియోలో ఉంది. గతంలో కూడా ధూమపానానికి వ్యతిరేకంగా ఆమె రూపొందించిన వీడియో వైరల్ అయింది. అభిమానుల కోరిక మేరకే ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.

adah sharma
Tollywood
Bollywood
video
drinking
  • Loading...

More Telugu News