Malayalam: సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని మోడల్‌పై అత్యాచారం.. మలయాళ సినీ నిర్మాతపై కేసు

  • తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం
  • 2017లో ఘటన
  • తాజాగా ఫిర్యాదు

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత వైశాక్ రాజన్‌పై ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. ఓ మోడల్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని వర్ధమాన నటిని నమ్మించిన నిర్మాత 2017లో ఎర్నాకుళంలోని కత్రికదావులో ఉన్న ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై అత్యాచారానికి పాల్పడిన నిర్మాత వైశాక్‌పై మోడల్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

‘వైశాక సినిమా’ పేరుతో నిర్మాత ఓ ప్రొడక్షన్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఈ బ్యానర్‌‌పై 2017లో ‘రోల్ మోడల్స్’, ‘ఛంక్జ్, ‘వెల్కం టు సెంట్రల్ జైల్ (2016), ‘పద్మశ్రీ భారత్ డాక్టర్ సరోజ్ కుమార్ (2012) వంటి సినిమాలు నిర్మించాడు. చివరిసారిగా ‘జానీ జానీ యస్ అప్పా’ అనే సినిమాను నిర్మించాడు.

Malayalam
film producer
woman
Vaishak Rajan
rape case
Kerala
  • Loading...

More Telugu News