Telugudesam: లక్షల కోట్ల అవినీతి చేసిన సీఎంను నిలదీస్తూనే ఉంటాం: చంద్రబాబుపై జీవీఎల్ ఫైర్

  • టీడీపీ.. టోటల్ దొంగల పార్టీగా ప్రజలకు తెలిసిపోయింది
  • ప్రజల నోట్లో మట్టికొట్టిన చంద్రబాబు
  • అలాంటి ఆయన ముందే కదా నిరసన తెలియజేయాల్సింది

బీజేపీ, భారతీయ జోకర్స్ పార్టీగా మారిందని, ఏపీకి నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్న మోదీ ఇంటి ముందు ధర్నా చేసే దమ్మూధైర్యం లేని బీజేపీ నాయకులు సీఎం చంద్రబాబుని అడ్డుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటని మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ మరోమారు స్పందించారు. ట్విట్టర్ వేదికగా జీవీఎల్ మండిపడ్డారు.

టీడీపీ, టోటల్ దొంగల పార్టీగా ప్రజలకు తెలిసిపోయిందని, ఆంధ్ర ప్రజల నోట్లో మట్టికొట్టి జేబులు నింపుకున్న చంద్రబాబు ముందే కదా నిరసన తెలియజేయాల్సిందని అన్నారు. లక్షల కోట్ల అవినీతి చేసిన ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

Telugudesam
Chandrababu
bjp
gvl
Nara Lokesh
  • Loading...

More Telugu News