YSRCP: తుస్సుమన్న కోడికత్తి డ్రామాకి కొత్త డైరెక్టర్ ని పెట్టినంత మాత్రాన రక్తికట్టదు: నారా లోకేశ్ సెటైర్లు
- అంతర్జాతీయ విచారణ సంస్థకి అప్పగించినా నిజం మారదు
- ఢిల్లీ మోదీ, ఆంధ్రా మోదీలు కాలుదూస్తున్నారు
- ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ పై లోకేశ్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఎన్ఐఏ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేసథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, కోడికత్తి కేసు అంతర్జాతీయ విచారణ సంస్థకి అప్పగించినా నిజం మారదని అన్నారు. ఢిల్లీ మోదీ, ఆంధ్రా మోదీలు కోడికత్తితో యుద్ధానికి కాలుదూస్తున్నారంటూ ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ లను విమర్శించారు.
తుస్సుమన్న కోడికత్తి డ్రామాకి కొత్త డైరెక్టర్ ని పెట్టినంత మాత్రాన రక్తికట్టదంటూ సెటైర్లు విసిరారు. కాగా, జగన్ పై దాడి ఘటన కేసులో చంద్రబాబును కాపాడటానికి డీజీపీ యత్నించారనీ, ఆయన్ను వదలిపెట్టబోమని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ విషయాలన్నింటిని ఎన్ఐఏ ముందు పెడతామని ఆయన వ్యాఖ్యానించారు.