India: బాంబులతో లేపేస్తా అన్న బీజేపీ ఎమ్మెల్యేకు దీటుగా కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ!

  • మోదీ వ్యతిరేకుల్ని లేపేస్తామని హెచ్చరిక
  • అతడిని సరిహద్దుకు పంపాలన్న ఒవైసీ
  • కుదరకుంటే శ్రీనగర్ కు అయినా పంపమని సెటైర్

ప్రధాని మోదీ పాలనలో దేశంలో అభద్రతా భావం ఉందని చెప్పినవాళ్లను బాంబులతో లేపేస్తానని బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తులు తమకు సురక్షితంగా అనిపించే ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. తాజాగా దీనిపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. స్వేచ్ఛగా జీవించే హక్కును భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ప్రసాదించిందని అసద్ గుర్తుచేశారు.

విక్రమ్ సైనీ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన ఆలోచనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ‘ప్రధాని మోదీ గారూ.. మీరు చెబుతున్న సబ్ కా సాత్(అందరినీ కలుపుకుని వెళ్లడం)పై మీ నేత సైనీ బాంబులు వేస్తున్నారు. ఆయన్ను వెంటనే భారత్-పాకిస్తాన్ ల సరిహద్దుకు పంపండి. అదీ కుదరకుంటే కనీసం శ్రీనగర్ లోని లాల్ చౌక్ కు అయినా పంపండి’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.

India
Narendra Modi
bomb
vikram saini
Asaduddin Owaisi
mim
BJP
mla
Twitter
  • Loading...

More Telugu News