Telangana: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డుకాదు: ఈసీ

  • ఇంత వరకు జరగని మంత్రివర్గ విస్తరణ
  • పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉందంటూ వార్తలు
  • విస్తరణకు కోడ్ అడ్డుకాదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డుకాదని... కేబినెట్ ను విస్తరించుకోవచ్చని తెలిపింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులు దాటిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. మంచిరోజులు లేవనే కారణంతో మంత్రవర్గ విస్తరణ వాయిదా వేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి తర్వాత విస్తరణ ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 30 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో, ఈ ఎన్నికలు ముగిసేంత వరకు విస్తరణ ఉండదనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఎన్నికల కోడ్ కు, మంత్రివర్గ విస్తరణకు సంబంధం ఉండదని ఎన్నికల సంఘం స్పష్టతను ఇచ్చింది.

Telangana
panchayat elections
code
cabinet
expansion
election commission
  • Loading...

More Telugu News