Hyderabad: దూరం వెళ్లేందుకు బద్ధకించి... ఎదురింట్లోనే చోరీ చేసిన ఘనుడు!

  • హైదరాబాద్, నేరేడ్ మెట్ ప్రాంతంలో ఘటన
  • ఎదురుగా ఉన్న కుటుంబంతో పరిచయం పెంచుకున్న డ్రైవర్
  • ఊరికి వెళ్లగానే దొంగతనం
  • దొంగను పట్టించిన సీసీటీవీ ఫుటేజ్

ఖర్చులు, జల్సాలకు డబ్బు కావాలి అతనికి. అయితే, ఎక్కువ దూరం వెళ్లి చోరీ చేసేందుకు బద్ధకించి, ఎదురింట్లోనే దొంగతనం చేశాడు. అయితే, ఆ కాలనీకి కొత్తగా ఎవరూ రాలేదన్న విషయం సీసీ టీవీలో నమోదు కాగా, పోలీసులు విచారించి, దొంగను పట్టేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, నేరేడ్ మెట్ ప్రాంతంలో కేవీ జనార్దన్ గౌడ్ (31) అనే కారు డ్రైవర్ ఉంటున్నాడు. అప్పులు పెరగడం, ఖర్చులకు డబ్బు లేకపోవడంతో, ఎదురింట్లో ఉండే శివప్రసాద్ తో పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఇంటికెళ్లి మాట్లాడుతూ, వాళ్ల ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ ఉంటాయో గుర్తు పెట్టుకున్నాడు.

మరో డ్రైవర్, గతంలో హత్యానేరంతో పాటు దొంగతనం కేసులున్న గోపాల్ ను తోడు కలుపుకున్నాడు. గత నెల 20న శివకుమార్, తన ఫ్యామిలీతో కడపకు బయలుదేరగా, అదే సరైన సమయమని భావించి, గుండం నారాయణ అనే పాత దొంగను టీమ్ లో చేర్చుకుని దొంగతనానికి పాల్పడ్డాడు. తాళం పగులగొట్టి, బీరువాను ధ్వంసం చేసి రూ. 3.40 లక్షల నగదు, లక్షన్నర విలువైన వజ్రపు టుంగరం, బంగారు నాణెం, పట్టు చీరలు, టూ వీలర్ ను దొంగిలించాడు.

 అదే రోజున సొత్తును ముగ్గురూ పంచుకున్నారు. శివకుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ఇది తెలిసినవారి పనేనని తొలుత గుర్తించి, ఆపై సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.24 లక్షల నగదు, ఉంగరం, వాహనాన్ని రికవరీ చేశామని, నిందితులను రిమాండ్ కు తరలించామని చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News