Telangana: అక్రమ సంబంధం ఎఫెక్ట్.. అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకుని చంపేసిన కసాయి తల్లి!

  • తెలంగాణలోని మంచిర్యాలలో ఘటన
  • వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ
  • కేసు నమోదుచేసిన పోలీసులు

కన్నతల్లి అనే పదానికి మచ్చ తెచ్చేలా ఓ మహిళ వ్యవహరించింది. ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డను కిరాతకంగా చంపేసింది. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు నాటకం ఆడింది. అయితే పోలీసులు తమదైన స్టయిల్ లో ప్రశ్నించడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఈ నెల 1న చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని జైపూర్‌ మండలం మిట్టపల్లికి చెందిన శంకరయ్య, దుర్గ భార్యభర్తలు. వీరికి 8 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా ఓ పిల్లాడు అంజన్న(3) ఉన్నాడు. ఈ క్రమంలో మిట్టపల్లికి చెందిన మరో వ్యక్తితో దుర్గ వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త పనికి వెళ్లిన సమయంలో అతనితో గడపటానికి కుమారుడు అంజన్న అడ్డుగా ఉండటంతో అతడిని చంపేయాలని ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 1న పిల్లాడి గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం సాయంత్రం భర్త ఇంటికి రాగానే కుమారుడిని నిద్ర లేపుతున్నట్లు నటిస్తూ ఏడుపు అందుకుంది.

దీంతో ఆందోళనకు లోనయిన శంకరయ్య, మిగతా కుటుంబ సభ్యులు చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ఈ వ్యవహారంలో కేసు నమోదుచేసిన పోలీసులు దుర్గపై అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో బాబును తానే హత్య చేశానని ఒప్పుకుంది. నిందితురాలిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana
extra martial affair
son killed
by mother
Police
  • Loading...

More Telugu News