: మారెప్పా.. ఏం చెప్పావప్ప!


మాజీ మంత్రి మారెప్ప తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కర్నూలులో నేడు మీడియాతో మాట్లాడిన ఈ వైఎస్సార్సీపీ నేత సీబీఐపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీబీఐ.. యూపీఏ అదుపాజ్ఞల్లో పనిచేస్తోందని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నెపంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి నీచరాజకీయాలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. జగన్ కు బెయిల్ రాకుండా కుట్ర పన్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ గేట్లు తెరిస్తే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అవుతాయని మారెప్ప జోస్యం చెప్పారు. ఇక జగన్ ను ప్రజలు సీఎంగా చూడాలనుకుంటున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

  • Loading...

More Telugu News