Kerala: పినరయి మూల్యం చెల్లించుకుని తీరుతాడు: పరిపూర్ణానంద

  • కేరళ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరించింది
  • మహిళల ప్రవేశంతో దెబ్బతిన్న హిందువుల మనోభావాలు
  • అర్చక వ్యవస్థలో జోక్యం వద్దని హితవు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో మహిళల ప్రవేశానికి మద్దతిచ్చిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి శాపం పెట్టారు. ఈ ఉదయం తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన, శబరిమల విషయంలో కేరళ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఆలయంలోకి మహిళల ప్రవేశం హిందూ మనోభావాలను దెబ్బతీయడమేనని, దీన్ని తాము అంగీకరించలేక పోతున్నామని అన్నారు. అర్చక వ్యవస్థలోనూ ప్రభుత్వాల జోక్యం సరికాదని, తిరుమలలో టీటీడీ, అర్చకుల మధ్య జరుగుతున్న పదవీ విరమణ వివాదంపై స్పందిస్తూ పరిపూర్ణానంద అన్నారు. 

Kerala
Paripoornananda
Pinarai Vijayan
Tirumala
TTD
  • Loading...

More Telugu News