Katrina Kaif: ఎంత న్యూ ఇయర్ అయినా మరీ ఇలానా... మైనస్ డిగ్రీల నీటిలో ఈతకొట్టిన కత్రిన కైఫ్

  • న్యూ ఇయర్ వేడుకలను యూరప్ లో జరుపుకున్న కత్రిన
  • ఇంగ్లిష్ చానల్ లో ఈదుతూ వేడుకలు
  • ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను పోస్టు చేసిన కత్రిన

'జిహ్వకో రుచి - పుర్రెకో బుద్ధి'... కత్రిన కైఫ్ షేర్ చేసుకున్న వీడియోను చూస్తే ప్రతి ఒక్కరికీ ఈ సామెతే గుర్తుకు వస్తుంది. కొత్త సంవత్సరం వేడుకలను ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కోచోట జరుపుకున్న వేళ, బాలీవుడ్‌ భామ కత్రిన కైఫ్‌ చాలా విభిన్నంగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంది. అది కూడా అలా ఇలా కాదు. ప్రస్తుతం ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లోకి పడిపోయిన పశ్చిమ యూరప్ లోని ఇంగ్లిష్ చానల్ వద్దకు వెళ్లి, అందులో ఈత కొట్టింది.

అసలు ఈ సమయంలో ఇంగ్లిష్‌ ఛానెల్‌ లో ఈదేందుకు సాధారణంగా ఎవ్వరూ సాహసం చేయరు. ఇక ఇక్కడి నీటిలో తన తల్లి, సోదరితో కలిసి ఈతకొట్టిన కత్రిన, ఈ వీడియోను తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో అభిమానులతో షేర్ చేసుకుంది. సముద్రంలో ఈత కొడితే చాలా బాగుంటుందని, అయితే, ఇటువంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల మాట వినాలని చెప్పింది. ఎవరినీ కించపరచవద్దని, శరీరాన్ని, మనసును ఒకే చోట ఉంచాలని ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. ఇక కత్రిన పెట్టిన వీడియోకు గంటల్లోనే లక్షల లైక్స్ వచ్చాయి.

Katrina Kaif
English Channel
Swmming
  • Loading...

More Telugu News