Lalu prasad yadav: ఐశ్వర్యతో విడాకులు పక్కా.. ఈ జీవితానికి ఇంతే!: తేజ్ ప్రతాప్

  • నేను మోదీలా ఉండాలనుకోవడం లేదు
  • నా తండ్రే నాకు ఆదర్శం
  • నా దృష్టంతా రాజకీయాలపైనే

తన భార్య ఐశ్వర్య రాయ్‌తో విడాకులు తీసుకోవడం పక్కా అని ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్‌ప్రతాప్ స్పష్టం చేశారు. విడాకుల అనంతరం ఒంటరిగానే ఉంటానని, మరో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం పాట్నాలోని పార్టీ కార్యాలయంలో ఉంటున్న ఆయనను పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి కలుస్తున్నారు.

ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన దృష్టిని పూర్తిగా రాజకీయాలవైపే కేంద్రీకరించినట్టు చెప్పారు. ఐశ్వర్యరాయ్‌తో విడాకులు ఖాయమని, ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోబోనని పేర్కొన్నారు. తన తండ్రే తనకు ఆదర్శమని, మోదీలానో, ఇంకెవరిలానే తాను ఉండాలనుకోవడం లేదన్నారు. తన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్‌లా పేదల సేవలోనే ఉంటానన్నారు.

తల్లి రబ్రీదేవి తనను బాగా చూసుకుంటున్నారని, తన నిర్ణయాలకు ఆమె మద్దతు ఉందని తెలిపారు. రాష్ట్రంలోని నితీశ్ ప్రభుత్వాన్ని పారదోలి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు.

Lalu prasad yadav
Tej pratap yadav
Aishwarya Rai
Bihar
Patna
Marriage
  • Loading...

More Telugu News