Andhra Pradesh: ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబును తిడుతుంటే.. నవ్వుకున్న మోదీ!

  • వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబుపై దూషణల పర్వం
  • ముసిముసిగా నవ్వుతూ విన్న మోదీ
  • ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమపై సమాధానం దాటవేత

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర బీజేపీ నేతలు తిడుతుంటే ప్రధాని మోదీ చిరునవ్వులు చిందిస్తూ వినడం కనిపించింది. ప్రధాని మోదీతో ఏపీ బీజేపీ నేతల వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ దృశ్యం కనిపించింది. సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుతో చర్చకు ప్రధాని రావాలా? ఆయనో లుచ్చా. చంద్రబాబుతో చర్చకు బీజేపీ కార్యకర్త చాలు’’ అనగానే మోదీ నవ్వుకున్నారు.

చంద్రబాబు లయ్యర్, లూటర్, చీటర్ అంటూ బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడినప్పుడు కూడా మోదీ నవ్వుకోవడం కనిపించింది. బాబువన్నీ అబద్ధాలేనన్న కన్నా వ్యాఖ్యలపై స్పందించిన మోదీ.. సత్యమే జయిస్తుంది అని బదులిచ్చారు. త్వరలోనే రాష్ట్రానికి వస్తానని మోదీ హామీ ఇచ్చారు. విశాఖపట్టణం కార్యకర్తలు రైల్వే జోన్ కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారని, ప్రత్యేక హోదా గురించి నిలదీస్తున్నారన్న మాణిక్యాలరావు వ్యాఖ్యలకు మోదీ స్పందించలేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయాన్ని పురందేశ్వరి తీసుకొచ్చినప్పుడు కూడా ఆ విషయాన్ని ప్రధాని దాటవేశారు.

Andhra Pradesh
BJP
Chandrababu
Narendra Modi
video conference
  • Loading...

More Telugu News