YSRCP: రైతుల కోసం వైసీపీ ఆందోళన.. కిందపడి స్పృహ కోల్పోయిన వైసీపీ నేత

  • సాగునీటి విడుదల కోసం రైతుల ఆందోళన
  • పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట
  • కోలుకుంటున్న బ్రహ్మనాయుడు

పోలీసులకు రైతులకు మధ్య జరిగిన తోపులాటలో కిందపడిన వైసీపీ నేత స్పృహ కోల్పోయారు. ప్రకాశం జిల్లా కురిచేడు వద్ద జరిగిందీ ఘటన. సాగునీటిని తక్షణం విడుదల చేయాలని కోరుతూ వినుకొండ వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పమిడిపాటు బ్రాంచ్ కెనాల్ వద్ద రైతులు బైఠాయించి ఆందోళనకు దిగారు.

 ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో వైసీపీ నేత బ్రహ్మనాయుడు కిందపడి స్పృహ కోల్పోయారు. వెంటనే స్పందించిన పోలీసులు, నేతలు ఆయనను దర్శిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

YSRCP
kurichedu
Brahmanaidu
Prakasam District
Farmers
Police
  • Loading...

More Telugu News