deepika: భర్తతో రెస్టారెంట్ కి వెళ్లిన దీపిక .. తన పేరుతో దోశ ఉండటం చూసి ఆశ్చర్యం!

  • టెక్సాస్ రెస్టారెంట్ కి వెళ్లిన దీపికా దంపతులు 
  • మెనూలో దీపిక పేరుతో దోశ 
  • సర్ ప్రైజ్ అయిన దంపతులు    

స్టార్ హీరోలకి .. హీరోయిన్స్ కి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. అందువలన సహజంగానే అక్కడక్కడా కొన్ని ఐటమ్స్ వాళ్ల పేర్లతో కనిపిస్తుంటాయి. కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారస్తులు ఈ పద్ధతిని అనుసరిస్తుంటారు. ముంబయికి వెళితే హోటల్స్ లో సంజయ్ దత్ .. షారుక్ ల పేర్లతో ఆయా ఆహార పదార్థాలను విక్రయిస్తుండటం చూస్తాం. అయితే ఆ స్టార్స్ తమ పేరుతో వున్న ఆహార పదార్థాలను తామే ఆర్డర్ చేయవలసి వస్తే అదో థ్రిల్ ను కలిగిస్తుంది .. ఇక విదేశీ రెస్టారెంట్లలో ఈ అనుభవం ఎదురైతే మరింత థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది.

ఇలాంటి పరిస్థితే టెక్సాస్ లోని ఓ రెస్టారెంట్ లో దీపికా పదుకొణే దంపతులకు ఎదురైంది. న్యూ ఇయర్ వేడుకలను ఈ జంట టెక్సాస్ లో జరుపుకుంది. స్థానికంగా ఒక హోటల్ కి వెళ్లిన ఈ దంపతులు అక్కడి మెనూలో దీపికా పదుకొణే పేరుతో వున్న 'దోశ'ను చూసి ఆశ్చర్యపోయారట. వెంటనే ఆ మెనూను రణ్ వీర్ ఫోటో తీసి తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. తనకి ఆ దోశ తినాలని వుంది అనే క్యాప్షన్ ఇచ్చాడు. 

  • Loading...

More Telugu News