Jasvinder singh: దొంగను పట్టించిన జీమెయిల్!

  • రూ.18 లక్షలతో పారిపోయిన జస్వీందర్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన గురుప్రీత్
  • ఐడీ, ఐపీ అడ్రస్ ఆధారంగా లొకేషన్ గుర్తింపు

  'జీ మెయిల్' ఓ దొంగను పట్టించింది. ఏదైనా కేసును ఛేదించేందుకు పోలీసులు పలు రకాలుగా యత్నిస్తుంటారు. దానిలో భాగంగానే జీ మెయిల్ ద్వారా యత్నించి సక్సెస్ అయ్యారు. ఢిల్లీకి చెందిన నగల వ్యాపారి గురుప్రీత్ సింగ్ వద్ద జస్వీందర్ సింగ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. తన ఆఫీసుకు సంబంధించిన రూ.18 లక్షల సొమ్ముతో జస్వీందర్ సింగ్ పారిపోయాడని గురుప్రీత్ డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తులో భాగంగా ఆఫీసులో జస్వీందర్ ఉపయోగించిన సిస్టమ్‌ను పోలీసులు చెక్ చేశారు. సిస్టమ్‌లో అతని జీమెయిల్ లాగ్ అవుట్ చేయలేదని గుర్తించారు. వెంటనే జస్వీందర్ ఐడీ, ఐపీ అడ్రస్ ఆధారంగా లొకేషన్‌ను గుర్తించి జస్వీందర్.. చండీఘర్‌లో ఉన్నట్టు తెలుసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.

Jasvinder singh
Gurupreeth singh
Delhi
G mail
Chandigarh
  • Loading...

More Telugu News