Bindu: అయ్యప్పను దర్శించుకుని చరిత్ర సృష్టించిన బిందు, కనకదుర్గల నేపథ్యమిది!
- దశాబ్దాల సంప్రదాయాన్ని తోసిరాజన్న ఇద్దరు మహిళలు
- కాలేజీ లెక్చరర్ గా పని చేస్తున్న బిందు
- ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న కనకదుర్గ
బిందు, కనకదుర్గ... ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని టీవీ చానళ్లలో వినిపిస్తున్న పేర్లు. దశాబ్దాల సంప్రదాయాన్ని, భక్తుల మనోభావాలను తోసిరాజని, నేడు శబరిమలలోని అయ్యప్పను దర్శించుకున్న మహిళలు. పీటీఐ తెలిపిన వివరాల మేరకు బిందు వయసు 44 సంవత్సరాలు. సీపీఐ (ఎంఎల్) కార్యకర్తగా, ఓ కాలేజీలో లెక్చరర్ గా ఆమె పనిచేస్తున్నారు. కనకదుర్గ వయసు 42 సంవత్సరాలు కాగా, కేరళ ప్రభుత్వ పౌర సరఫరాల విభాగంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ గత నెల 24న ఆలయానికి వచ్చి, స్వామిని దర్శించకుండా వెనక్కు తిరిగి వెళ్లిపోయిన 11 మంది మహిళల బృందంలో ఉన్నారు. మకరవిళక్కు సందర్భంగా డిసెంబర్ 30న ఆలయాన్ని తెరవగా, ఆపై రెండు రోజుల తరువాత భక్తుల సంఖ్య బాగా పలచబడటంతో వారి కోరిక నెరవేరింది.
Kerala Chief Minister Pinarayi Vijayan: Today, two women entered #SabarimalaTemple. We had issued standing orders to police to provide all possible protection to any woman who wants to enter the temple. pic.twitter.com/GdfS2BEi6i
— ANI (@ANI) January 2, 2019