Happy New Year 2018: కొత్త సంవత్సర వేడుకల్లో తప్పులో కాలేసిన ఆస్ట్రేలియా.. ఘోర తప్పిదాన్ని గుర్తించలేకపోయిన 10 లక్షల మంది!

  • ‘హ్యాపీ న్యూ ఇయర్ 2018’ అంటూ హార్బర్ బ్రిడ్జిపై అలంకరణ
  • చాలా చిన్న విషయమని కొట్టి పడేస్తున్న సిడ్నీ వాసులు
  • సోషల్ మీడియాలో వైరల్

ప్రపంచం మొత్తం 2019 సంవత్సరాన్ని ఆహ్వానిస్తే ఆస్ట్రేలియా మాత్రం ఘోర తప్పిదం చేసింది. సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపై ‘హ్యాపీ న్యూ ఇయర్ 2018’ అంటూ పెద్ద సైన్ బోర్డును ఏర్పాటు చేసింది. అయినప్పటికీ తప్పును గ్రహించని సిడ్నీ వాసులు అలాగే సంబరాలు చేసుకున్నారు. తప్పు జరిగిపోయిందని, నిజానికి అది 2019 అని తమకు తెలుసని ఆ తర్వాత తీరిగ్గా చెప్పుకొచ్చారు.  

విద్యుద్దీపాలతో సిడ్నీ హార్బర్ బ్రిడ్జిని శోభాయమానంగా అలంకరించిన అధికారులు ‘హ్యాపీ న్యూ ఇయర్ 2018’ అని తాటికాయంత అక్షరాలతో రాశారు. పది లక్షల మంది అక్కడే బాణసంచా కాల్చి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఉత్సాహంగా చిందులేశారు. అయితే, వీరిలో ఏ ఒక్కరు తప్పును గ్రహించకపోవడం విశేషం. ఆస్ట్రేలియా మొత్తంలో న్యూ ఇయర్ వేడుకలను ఇక్కడే ఘనంగా నిర్వహించారు.

సిడ్నీ హార్బర్‌లో జరిగే వేడుకలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అలాంటిది అక్కడే ఘోర తప్పిదం జరిగినా ఎవరూ గమనించకపోవడం గమనార్హం. చివరికి ఓ వ్యక్తి తప్పును గుర్తించి ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, సిడ్నీ ప్రజలు మాత్రం అది చిన్న తప్పేనంటూ కొట్టి పడేస్తున్నారు.

Happy New Year 2018
Australia
sydney
Harbour Bridge
firework
  • Loading...

More Telugu News