Ramulu naik: కేసీఆర్‌ది అధికార మదం.. రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు

  • ఇది నా రాజ్యం.. నేను చెప్పిందే వేదం అనే భావనతో ఉన్నారు
  • ప్రజల్ని మరోమారు రెచ్చగొట్టాలని చూస్తున్నారు
  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 20 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నిర్వహించలేదని మండిపడ్డారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రజలను మరోమారు మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తానని, అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు ఎవరు? అంటూ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది నా రాజ్యం.. నేను చెప్పిందే వేదం అనే భావనతో, అధికార మదంతో కేసీఆర్ విర్రవీగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం పక్కా అని జోస్యం చెప్పారు.

Ramulu naik
Telangana
Congress
KCR
Rahul Gandhi
  • Loading...

More Telugu News