Chandrababu: ఏపీ ఆర్థిక స్థితిగతులపై చివరి శ్వేతపత్రం విడుదల
- పదో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- ప్రజల ఆదాయాన్ని పెంచే అనేక చర్యలు చేపట్టాం
- ఇలాంటి చర్యలు ఏ ప్రభుత్వమూ చేయలేదు
ఏపీ ఆర్థిక స్థితిగతులపై చివరి శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేశారు. అమరావతిలోని ప్రజావేదికలో పదో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల ఆదాయాన్ని పెంచే అనేక చర్యలు చేపట్టామని, ఇలాంటి చర్యలను ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ చేయలేదని చెప్పారు.
రేపటి నుంచి జన్మభూమి గ్రామసభల్లో, వార్డు సభల్లో నాలుగున్నరేళ్ల ప్రగతి, సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. పదిరోజుల పాటు నిర్వహించే జన్మభూమి సభల్లో ప్రజలకు వివరిస్తామని, వ్యవసాయ రంగంలో 97 శాతం ఆదాయం పెంచగలిగామని, నాలుగేళ్లలో ఇది రైతులకు రెట్టింపు ఆదాయమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ తర్వాత ప్రతి గ్రామానికి విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.