Ramgopal Varma: మళ్లీ అవే రోజులనుకుని బాధపడాలి: ఆర్జీవీ

  • రోజులన్నీ సంతోషంగా మారిపోవు
  • ఆశతో జీవిస్తుంటాం
  • చెప్పాల్సిన అవసరం లేకున్నా చెబుతున్నా

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా.. ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన దేనికి ఎలా స్పందిస్తారో ఊహించడం కూడా కష్టం. అందుకే ఆయనను సంచలన దర్శకుడు అంటారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన యథావిధిగా డిఫరెంట్‌గా స్పందించారు. ‘హ్యాపీ న్యూఇయర్‌’ అని చెప్పుకోవడం వల్ల రోజులన్నీ సంతోషంగా మారిపోవని.. అయినా ఆశతో జీవిస్తుంటామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘కేవలం ‘హ్యాపీ న్యూఇయర్‌’ అని చెప్పుకోవడం వల్ల మన పాత, కొత్త సంవత్సరాలు ఆనందంతో నిండిపోవని మనందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ ఆశతో జీవిస్తుంటాం. మరోసారి.. చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెబుతున్నా. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ పూర్తయిన తర్వాత మళ్లీ అవే రోజులు అనుకుని బాధపడాల్సిందే’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Ramgopal Varma
New Year
Wishes
Twitter
  • Loading...

More Telugu News