New Year: డబ్బు తీసుకుని వేడుకలు సరిగ్గా చేయలేదని... వేదికకు నిప్పంటించి బీభత్సం సృష్టించిన యువత!

  • హైదరాబాద్, మాదాపూర్ లో ఘటన
  • మద్యం సరిగ్గా సరఫరా చేయడం లేదని గొడవ
  • ఆపై మద్యం సీసాలను పగులకొట్టి, నిప్పు

తమ వద్ద డబ్బులు తీసుకుని, నూతన సంవత్సరం వేడుకలు సరిగ్గా జరపడం లేదని హైదరాబాద్ యువత నానాయాగీ చేసింది. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని మాదాపూర్, సిద్ధివినాయక నగర్ లోని క్రికెట్ మైదానంలో జరిగింది. ఇక్కడ ఓ సంస్థ కొత్త సంవత్సరం వేడుకలకు ఏర్పాట్లు చేయగా, మద్యం సరఫరా సరిగ్గా జరగడం లేదన్న కారణంతో గొడవ మొదలైంది.

డీజే బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన యువకులు, తొలుత అక్కడున్న టేబుళ్లు, కుర్చీలను విసిరేశారు. ఆపై మద్యం సీసాలను వేదికపై పగులగొట్టి నిప్పంటించారు. దీంతో మంటలు వ్యాపించగా, వేడుకలకు వచ్చిన వారు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు, ఘటనాస్థలికి చేరుకుని, యువకులను చెదరగొట్టారు.

New Year
Youth
Hyderabad
Fire Accident
Police
Madapur
  • Loading...

More Telugu News