akhil: అల్లరి ప్రేమికుడిగా కనిపించనున్న అఖిల్

  • సరికొత్తగా సాగే ప్రేమకథగా 'మిస్టర్ మజ్ను'
  • సిక్స్ ప్యాక్ తో కనిపించనున్న అఖిల్ 
  • తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ  

అఖిల్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' సినిమా రూపొందుతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా నిర్మితమవుతోంది. అల్లరి ప్రేమికుడిగా అఖిల్ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన కథానాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది. కథాపరంగా ఈ సినిమా విదేశాల్లో ఎక్కువగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా హిట్ కావడం అఖిల్ కి ఎంతో అవసరం. అందువలన కథా కథనాల విషయంలోనే కాదు, పాటలు .. డాన్స్ విషయంలోను అఖిల్ శ్రద్ధ తీసుకున్నాడట.

ఇక ప్రేమ సన్నివేశాలను చూస్తున్నప్పుడు ఇంతకుముందు ఏదో సినిమాలో చూశామే అనే ఆలోచన ఎంత మాత్రం రానీయకుండా పూర్తి కొత్తదనం ఉండేలా వెంకీ అట్లూరి జాగ్రత్తలు తీసుకున్నాడట. అదే విధంగా కామెడీ కూడా కొత్తగా ఉండేలా చూసుకున్నాడని అంటున్నారు. అఖిల్ లుక్ తో సహా అన్నీ వైవిధ్యంగా అనిపించేలా ఈ సినిమా రూపొందుతోందని చెబుతున్నారు. అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ .. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. 

akhil
nidhi agarwal
  • Loading...

More Telugu News