Manisha Koirala: కేన్సర్ నాకొచ్చిన గొప్ప బహుమతి: బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా

  • 2012లో కేన్సర్ బారిన పడిన మనీషా
  • కేన్సర్ కాకుంటే మరో వ్యాధి వచ్చి ఉండేదన్న నటి
  • కేన్సర్ జీవితాన్ని సమూలంగా మార్చివేసిందన్న కొయిరాలా

ఒవేరియన్ కేన్సర్‌తో బాధపడి మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా కొండంత ఆత్మవిశ్వాసంతో దానిని జయించింది. 2012లో తనకు కేన్సర్ వచ్చినట్టు తెలుసుకున్న ఆమె కుంగిపోలేదు. ధైర్యంగా దానిని ఎదుర్కొంది. తనకు కేన్సర్ రావడానికి తన లైఫ్ స్టైలే కారణమని పలుమార్లు చెప్పుకొచ్చిన మనీషా ఆ తర్వాత ఆ జీవితానికి దూరం జరిగింది.

తాజాగా, కేన్సర్ తనకు వచ్చిన గొప్ప బహుమతి అని పేర్కొంది. కేన్సర్ తన జీవితంలోకి వచ్చి గొప్ప ధైర్యాన్ని ఇచ్చిందని, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిందని పేర్కొంది. తాను ఆల్కహాలిక్‌గా మారిపోవడం, నియంత్రణ లేని లైఫ్ స్టైల్ తనను వ్యాధుల వైపు నడిపించిందని పేర్కొంది. ఒకవేళ కేన్సర్ రాకుంటే మరో వ్యాధి ఏదో తన జీవితాన్ని కబళించి ఉండేదని వివరించింది.

‘‘కేన్సర్‌ను నాకొచ్చిన బహుమానంగానే భావిస్తా. అది నా ఆలోచనలో పదును పెంచింది. నా దృక్కోణాన్ని మార్చింది.  నా దుందుడుకు స్వభావాన్ని, ఆందోళనను ప్రశాంతంగా మార్చుకోవడంలో సఫలమయ్యాను’’ అని మనీషా వివరించింది.

Manisha Koirala
Bollywood
ovarian cancer
Actress
  • Loading...

More Telugu News