GST: సినీ ప్రేమికులకు శుభవార్త.. నేటి నుంచి తగ్గనున్న టికెట్ ధరలు

  • 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిన టికెట్ ధరలు
  • వంద రూపాయల లోపు టికెట్‌పై 12 శాతం జీఎస్టీ
  • ఇటీవలే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

కొత్త సంవత్సరం వస్తూవస్తూ సినీ ప్రేమికులకు శుభవార్త తీసుకొచ్చింది. ప్రభుత్వం ఇటీవల తగ్గించిన జీఎస్టీ ధరలు నేటి నుంచి అమలు కానున్నాయి. పలు వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో గత నెల 22న జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సినిమా టికెట్లు, టీవీల ధరలు నేటి నుంచి తగ్గనున్నాయి. ఇప్పటి వరకు వంద రూపాయలకు పైన ఉన్న టికెట్‌పై 28 శాతం పన్ను ఉండగా నేటి నుంచి అది 18 శాతంగా ఉండనుంది. వంద రూపాయల లోపు టికెట్‌పై ఇప్పటి వరకు 18 శాతం జీఎస్టీ వసూలు చేయగా, నేటి నుంచి 12 శాతం మాత్రమే వసూలు చేయనున్నారు. సో.. వినోదం నేటి నుంచి మరింత చవక కానున్నందన్నమాటే. అలాగే, కంప్యూటర్ మానిటర్లు, 32 అంగుళాల టీవీ స్క్రీన్లపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు.

GST
Cinema
Movie tickets
Arun Jaitly
TV sets
monitor
  • Loading...

More Telugu News