KTR: ఇంతకంటే ఎక్కువ ఇంకేం ఆశిస్తాం: కేటీఆర్ న్యూ ఇయర్ విషెస్

  • అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు
  • 2018 చాలా గొప్ప సంవత్సరమన్న కేటీఆర్
  • నూతన సంవత్సరం గొప్పగా ఉండాలని ఆకాంక్ష

టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. నూతన సంవత్సరంలో అందరికీ ఆనందం, ఆరోగ్యం, ఉల్లాసం, శాంతి, ప్రేమ కలగాలని కోరుకున్నారు. 2018 చాలా గొప్ప సంవత్సరమని పేర్కొన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. పిల్ల, పెద్ద రోడ్లపైకి వచ్చి వేడుకలు జరుపుకున్నారు. సరిగ్గా రాత్రి 12 గంటలకు బాణసంచా కాల్చి పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించారు.

KTR
Telangana
New year
Wishes
Hyderabad
  • Loading...

More Telugu News