Pawan Kalyan: రాబోయే 100 రోజుల్లో ఏం చేస్తామంటే.. యాక్షన్ ప్లాన్ ప్రకటించనున్న పవన్ కల్యాణ్!

  • రేపు పార్టీ కార్యాలయంలో సమావేశం
  • హాజరుకానున్న నియోజకవర్గాల కోఆర్డినేటర్లు
  • యూరప్ నుంచి తిరిగొచ్చిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు విజయవాడలో పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రేపు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో ఆయన రాబోయే 100 రోజుల్లో పార్టీ పటిష్టతకు, ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్ విడుదల చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. ఇటీవల కుటుంబంతో కలసి యూరప్ వెళ్లిన పవన్ కల్యాణ్ తాజాగా తన పర్యటనను పూర్తి చేసుకుని హైదరాబాదుకు చేరుకున్నారు. 

Pawan Kalyan
Andhra Pradesh
Telangana
Jana Sena
Vijayawada
party meet
100 days
action plan
  • Loading...

More Telugu News