jagan: రాజకీయాలు, పాలనలో నూతన సంవత్సరం కొత్త ధోరణికి శ్రీకారం చుడుతుంది: జగన్

  • కొత్త సంవత్సరం ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలి
  • నూతన సంవత్సరంలో ప్రజలకు సుపరిపాలన అందాలి
  • కొత్త పాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి మనస్సును తాకేలా ఉంటాయి

ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైసీపీ అధినేత జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం తెలుగు ప్రజలకు ఆనందాల సంవత్సరం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, ఆరోగ్యం కలగాలని కోరుకున్నారు.

ఏపీ ప్రజల జీవితాల్లో మంచి మార్పులకు కొత్త సంవత్సరం నాంది పలుకుతుందని అన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు సుపరిపాలన అందుతుందని, విలువలు లేని అవకాశవాదుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు, పాలనలో సరికొత్త ధోరణికి నూతన సంవత్సరం శ్రీకారం చుడుతుందని తెలిపారు. కొత్త పాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి మనస్సును తాకేలా ఉంటాయని చెప్పారు.

jagan
new year
wishes
YSRCP
  • Loading...

More Telugu News