: ప్రధాని, సోనియా మధ్య విభేదాల్లేవ్: కాంగ్రెస్


పీకే బన్సల్, అశ్వినీ కుమార్ లను కేంద్ర మంత్రి పదవుల నుంచి తొలగించే క్రమంలో ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీల మధ్య విభేదాలు చెలరేగినట్టు వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్థన్ ద్వివేది ఖండించారు. సోనియా, ప్రధాని మధ్య ఎలాంటి పొరపొచ్చాలు చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. సర్కారులో అందరి మద్దతు ప్రధానికి ఉందని, 2014 వరకు ఆయనే ప్రధానిగా కొనసాగుతారని తెలిపారు.

  • Loading...

More Telugu News