kadapa: మారనున్న కడప రూపురేఖలు... చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

  • త్వరలోనే కడప అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు 
  • ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు
  • 'కుడా' పరిధిలోకి కడప చుట్టుపక్కల ఉన్న 39 మండలాలు

త్వరలోనే కడప రూపురేఖలు మారబోతున్నాయి. కడప అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా)కి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'కుడా' ఏర్పాటు కోసం గత కొన్ని రోజులుగా సన్నాహకాలు జరుగుతున్నాయి. జూలై 25న జరిగిన కలెక్టర్ల సమావేశంలో కుడా ఏర్పాటు చేయాలనే విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు... ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో, కడప చుట్టుపక్కల ఉన్న 39 మండలాలను 'కుడా' పరిధిలోకి తీసుకువచ్చేలా అధికారులు ప్రతిపాదనలను సమర్పించారు.

అనంతరం 'కుడా'కు కేబినెట్ ఆమోదం లభించింది. గత శనివారం జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో, 'కుడా' ఏర్పాటుపై జీవో జారీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. తొలి గెజెట్ నోటిఫికేషన్ తో ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేసి, పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఛైర్మన్ గా రాజకీయ నేతను, వైస్ ఛైర్మన్ గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తారు. 

  • Loading...

More Telugu News