mashrafe mortaza: బంగ్లాదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన క్రికెట్ కెప్టెన్

  • అవామీ లీగ్ తరపున బరిలోకి దిగిన మోర్తజా
  • మోర్తజాకు 2,74,418 ఓట్లు
  • సమీప ప్రత్యర్థికి 8,006 ఓట్లు మాత్రమే

బంగ్లాదేశ్ ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ టీమ్ కెప్టెన్ మష్రఫే మోర్తాజా అవామీ లీగ్ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించాడు. నరెయిల్-2 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మోర్తాజాకు 2,74,418 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థికి కేవలం 8,006 ఓట్ల మాత్రమే వచ్చాయి. బంగ్లాదేశ్ తరపున మోర్తజా 36 టెస్టులు, 202 వన్డేలు, 54 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 78, వన్డేల్లో 258, టీ20ల్లో 42 వికెట్లను పడగొట్టాడు. టెస్టుల్లో 797, వన్డేల్లో 1,728, టీ20ల్లో 377 పరుగులు సాధించాడు. 

mashrafe mortaza
bangladesh
cricketer
awami league
mp
  • Loading...

More Telugu News